Advertisementt

బాలయ్య క్రేజ్ అమరావతిలో కూడా

Sun 24th Nov 2024 08:49 PM
daaku maharaaj  బాలయ్య క్రేజ్ అమరావతిలో కూడా
Daaku Maharaaj explosive event in USA బాలయ్య క్రేజ్ అమరావతిలో కూడా
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ-కొల్లి బాబీ కాంబోలో జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా రాబోతున్న డాకు మహారాజ్ చిత్ర ప్రమోషన్స్ పై ఇపుడు అందరిలో విపరీతమైన ఆసక్తి నడుస్తుంది. ఎందుకంటే జనవరి 10న సంక్రాంతికి ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ చిత్రం ప్రమోషన్స్ ను మేకర్స్ డిఫ్రెంట్ గా మొదలు పెట్టారు. 

అందులో భాగంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను USA లో డల్లాస్ లో డిసెంబర్ 21న నిర్వహించబోతున్నారు. దానితో బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా యుఎస్ లోనే ప్రమోట్ చెయ్యడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. యుఎస్ లోని డల్లాస్ పురంలో బాలయ్య డాకు మహారాజ్ ఈవెంట్ జనవరి 4 న నిర్వహిస్తున్నట్లుగా అనౌన్స్ చేసారు.  

మరోపక్క హ్యాట్రిక్ ఎమ్యెల్యేగా అసెంబ్లీ లో అడుగుపెట్టిన బాలయ్య అమరావతి సాక్షిగా తన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అభిమానుల నడుమ కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తారంటూ ప్రచారం షురూ అయ్యింది. అది చూసిన నందమూరి అభిమానులు ఏమయ్యా బాలయ్య డాకు మహారాజ్ ఈవెంట్ అమెరికాలోనే కాదు అమరావతిలో కూడా అదరగొట్టాలి అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. 

Daaku Maharaaj explosive event in USA:

Daaku Maharaaj explosive event in Amaravathi

Tags:   DAAKU MAHARAAJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ