Advertisementt

Suriya45 స్టార్ట్ అయ్యింది

Wed 27th Nov 2024 06:10 PM
suriya 45  Suriya45 స్టార్ట్ అయ్యింది
Suriya 45 begins with Poojai Suriya45 స్టార్ట్ అయ్యింది
Advertisement
Ads by CJ

కంగువ తో దెబ్బతిన్న హీరో సూర్య ప్రస్తుతం భార్య జ్యోతికతో కలిసి గుడులు గోపురాలు తిరుగుతూన్నారు. అయితే కంగువ ఎఫెక్ట్ తో ఆయన కొద్దిరోజులు బ్రేక్ తీసుకుంటారు అనుకుంటే వెంటనే సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసారు. 

హీరో సూర్య నెక్స్ట్ మెగా-ఎంటర్‌టైనర్ సూర్య 45 పూజా కార్యక్రమంతో ఆనైమలైలోని అరుల్మిగు మాసాని అమ్మన్ ఆలయంలో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.  

ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్ హౌస్ మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ. మల్టీ ట్యాలెంటెడ్  ఆర్జే బాలాజీ మెగా-ఎంటర్‌టైనర్ కి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కోయంబత్తూర్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్ జరగనుంది. సూర్య, ఇతర ప్రధాన నటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు  హై బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2025 సెకండ్ హాఫ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలోని మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలని మేకర్స్ తెలియజేస్తారు.

Suriya 45 begins with Poojai:

Dream Warrior Pictures Suriya 45 begins with Poojai

Tags:   SURIYA 45
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ