Advertisementt

పవన్ వీరమల్లు చివరి షెడ్యూల్ షురూ

Thu 28th Nov 2024 10:48 AM
hari hara veera mallu  పవన్ వీరమల్లు చివరి షెడ్యూల్ షురూ
Hari Hara Veera Mallu Part-1 update పవన్ వీరమల్లు చివరి షెడ్యూల్ షురూ
Advertisement
Ads by CJ

ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

ఇటీవల చిత్ర బృందం, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 - 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ని ప్రత్యేకంగా నియమించారు. ఈ యుద్ధ సన్నివేశం అద్భుతంగా రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది.

హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ తో పాటు, 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ తో హరి హర వీర మల్లు చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

Hari Hara Veera Mallu Part-1 update :

Hari Hara Veera Mallu shooting update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ