Advertisementt

చ‌ర‌ణ్‌, కియారా రొమాంటిక్ ఫోజ్

Thu 28th Nov 2024 07:06 PM
game changer  చ‌ర‌ణ్‌, కియారా రొమాంటిక్ ఫోజ్
Naanaa Hyraanaa song from Game Changer చ‌ర‌ణ్‌, కియారా రొమాంటిక్ ఫోజ్
Advertisement
Ads by CJ

రామ్ చ‌ర‌ణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న గేమ్ చేంజర్. భారీ అంచ‌నాల న‌డుమ 2025లో విడుద‌ల‌వుతున్న పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌వుతుంది. విడుద‌ల తేది ద‌గ్గ‌ర‌వుతున్న కొద్ది రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జోడీ మ‌ధ్య కెమిస్ట్రీని స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఎంత గొప్ప‌గా తెర‌కెక్కించారోన‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఎట్ట‌కేల‌కు ఈ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుద‌లైంది. తెలుగులో నా నా హైరానా.. హిందీలో జానా హైరాన్ సా.. త‌మిళంలో లై రానా అంటూ మెలోడీ ఆఫ్ ది ఇయ‌ర్‌గా ఈ పాట ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోహ‌న‌ప‌రుస్తోంది.  ఈ పాట‌ను తెలుగులో రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాయ‌గా, త‌మిళంలో వివేక్‌, హిందీలో కౌశ‌ర్ మునీర్ రాశారు. ఈ పాట‌కు సంబంధించిన బీటీఎస్‌కు కూడా ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఇక రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జోడీ పాట‌లోని స్వ‌చ్చ‌త‌ను హావ‌భావాల రూపంలో ప‌లికించారు. పాట విడుద‌ల కాగానే ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తోంది.

ప్రేమ‌లో ఉన్న హీరో హీరోయిన్లు ఒక‌రిపై ఒక‌రికి మ‌న‌సులోని ప్రేమ భావాలు ప‌దాల రూపంలో అందంగా అమ‌ర్చిన‌ట్లు కుదిరాయి. ఇక మేకింగ్ విష‌యానికి వ‌స్తే శంక‌ర్ మ‌రోసారి పాట‌ల‌ను చిత్రీక‌రించ‌టంలో త‌న‌కు తానే సాటి అని మ‌రోసారి నా నా హైరానా పాట‌తో నిరూపించుకున్నారు. న్యూజిలాండ్‌లో ఈ పాట‌ను ఇండియాలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో చిత్రీక‌రించారు.  ఒక్కో స‌న్నివేశం ఒక్కో పెయింటింగ్‌లా విజువ‌ల్ బ్యూటీతో పాట మ‌న‌సుని తేలిక ప‌రుస్తోంది. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నుకునేంత గొప్ప‌గా పాట‌లోని ప్ర‌తీ ఫ్రేమ్ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఈ పాట‌ను ఫ్యూజ‌న్ మెలోడీ (వెస్ట్ర‌న్‌, క‌ర్ణాటిక్ కాంబో)గా ట్యూన్ చేశారు. అలాగే బ‌ర్న్ట్ టోన్స్‌ను ఉప‌యోగించారు.. రెండు మోనో టోన్స్‌ను ఓ స్టీరియో సౌండ్‌గా మార్చి ఈ పాట‌లో ఉప‌యోగించ‌టం విశేషం.

సారెగ‌మ మ్యూజిక్ పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నగేమ్ చేంజ‌ర్ సినిమాలోని ఈ పాట‌ను శ్రేయా ఘోష‌ల్, కార్తీక్ పాడారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీని అందించారు. ఈ పాటను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా అనౌన్స్ చేసిన పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్లో పాట‌పై అంచ‌నాల‌ను ఎంత‌గానో పెంచింది. 

Naanaa Hyraanaa song from Game Changer:

Naanaa Hyraanaa song from Ram Charan and Kiara Advani Game Changer Is Out!

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ