Advertisementt

సంక్రాంతి బరిలోకి ఎంటర్ అవుతున్న అజిత్

Fri 29th Nov 2024 10:11 AM
ajith  సంక్రాంతి బరిలోకి ఎంటర్ అవుతున్న అజిత్
VidaaMuyarchi In Cinemas worldwide from PONGAL సంక్రాంతి బరిలోకి ఎంటర్ అవుతున్న అజిత్
Advertisement
Ads by CJ

అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం విడాముయ‌ర్చి. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల‌వుతుంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ను కంప్లీజ్ చేసుకుంటోంది. తాజాగా విడాముయ‌ర్చి టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే సినిమాలో హీరో అజిత్ కుమార్ డిఫ‌రెంట్ అవ‌తార్‌లో కనిపిస్తున్నారు. ప్ర‌పంచ‌మంతా నిన్ను న‌మ్మ‌క‌పోయినా ప‌రావాలేదు.. నిన్ను నువ్వు న‌మ్ముకో.. అనే కాన్సెప్ట్‌తో సినిమా యాక్ష‌న్ బేస్డ్ మూవీగా తెర‌కెక్కింది. అజిత్ దేని కోస‌మో అన్వేషిస్తున్నారు.. చివ‌ర‌కు త‌న‌కు కావాల్సిన దాని కోసం విల‌న్స్ భ‌ర‌తం ప‌డుతున్నారు. తాను సాధించాల్సిన ల‌క్ష్యం కోసం ఏం చేయ‌టానికైనా, ఎంత దూరం వెళ్ల‌టానికైనా, ఎవ‌రినైనా ఎదిరించేలా ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని ఓ వైవిధ్య‌మైన పాత్ర‌లో ఆయ‌న మెప్పించ‌బోతున్నారు అజిత్‌. టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకున్నాయి. 

అజిత్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ మంగాత (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించ‌నున్నారు. అలాగే విడాముయ‌ర్చిలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వారి పాత్ర‌ల‌ను కూడా టీజ‌ర్‌లో రివీల్ చేశారు. అలాగే సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌కటించారు. 

కోలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతాన్నిఅందిస్తుండ‌గా అజిత్ కుమార్ విడాముయ‌ర్చి సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.

VidaaMuyarchi In Cinemas worldwide from PONGAL:

Ajith VidaaMuyarchi In Cinemas worldwide from PONGAL 2025!

Tags:   AJITH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ