స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు,
ప్రముఖ నిర్మాత జి.ఆదిశేషగిరిరావు ఇంటినుంచి
నేడు శుభవార్త వెలువడింది.
ఆయన తనయుడు బాబీ కవల పిల్లలకు తండ్రయ్యారు.
కవలల (బాబు, పాప) రాకతో
ఘట్టమనేని వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఈ శుభవార్త విన్న వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో సహా
ఆ కుటుంబ సభ్యులందరూ బాబీ దంపతులకు,
ఆదిశేషగిరిరావు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.