Advertisementt

ద రేజ్ ఆఫ్ డాకు రిలీజ్

Sat 14th Dec 2024 06:44 PM
daaku maharaaj  ద రేజ్ ఆఫ్ డాకు రిలీజ్
The Rage of Daaku Song from Daaku Maharaaj ద రేజ్ ఆఫ్ డాకు రిలీజ్
Advertisement
Ads by CJ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం డాకు మహారాజ్ ను దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. 

కేవలం టైటిల్ అనౌన్సమెంట్ తోనే డాకు మహారాజ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నందమూరి అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా చూడాలనే ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ, ఇప్పుడు ఈ చిత్ర పాటల పండుగ మొదలైంది.

బాలకృష్ణ నటించిన గత మూడు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించి, ఆ ఘన విజయాలలో కీలక పాత్ర పోషించిన తమన్ డాకు మహారాజ్ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ది రేజ్ ఆఫ్ డాకు పేరుతో మొదటి గీతం విడుదలైంది. బాలకృష్ణ, తమన్ కలయిక అంటే, సంగీత ప్రియుల్లో ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, తమన్ ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు. 

డాకు మహారాజ్ పాత్ర తీరుని తెలియజేసేలా గీత రచయిత అనంత శ్రీరామ్ అర్థవంతమైన, శక్తివంతమైన సాహిత్యాన్ని అందించారు. డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా" వంటి పంక్తులతో మరోసారి తన కలం బలం చూపించారు. ఇక గాయకులు భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి. రావు, కె. ప్రణతి తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు. 

లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. విజువల్ గా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో భారీతనం కనిపిస్తోంది. అలాగే ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, బలమైన భావోద్వేగాలతో సినిమా అద్భుతమైన అనుభూతిని పంచనుందని లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది.

The Rage of Daaku Song from Daaku Maharaaj :

The Rage of Daaku Song from Daaku Maharaaj Released!

Tags:   DAAKU MAHARAAJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ