Advertisementt

అమెరికాలో తారకరామం పుస్తకావిష్కరణ

Mon 16th Dec 2024 11:56 PM
taaraka raamam  అమెరికాలో తారకరామం పుస్తకావిష్కరణ
Taaraka Raamam book launch in America అమెరికాలో తారకరామం పుస్తకావిష్కరణ
Advertisement
Ads by CJ

 తెలుగు ప్రజల హృదయాల నేలిన విశ్వవిఖ్యాత నట చక్రవర్తి, నిత్య నీరాజనాలందుకుంటున్న తెలుగుజాతి ఆత్మగౌరవ నినాద ప్రదాత అన్న నందమూరి తారక రామారావు గారి సినిమా వజ్రోత్సవాల సందర్భంగా అమెరికాలో తారకరామం గ్రంథాన్ని ఆవిష్కరించారు. 

కనెక్టికట్ లో ఎన్. టి. ఆర్ లిటరేచర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ వైస్ చైర్మన్ అశ్విన్ అట్లూరి సారధ్యం లో ఎన్. టి. ఆర్ అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ మరియు రచయిత భగీరథ గారి సంపాదకత్వంలో రూపొందిన తారకరామం ప్రత్యేక సంచిక విడుదలైంది. 

ఈ గ్రంథాన్ని ఎన్. టి. ఆర్ లిటరేచర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు,  భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, సినిమారంగ ప్రముఖుల సమక్షంలో విజయవాడలో విడుదలైంది. ఇదే సందర్భంలో అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలో మా మహానాడు న్యూ ఇంగ్లాండ్ టీం తో కలిసి విడుదల చెయ్యటం ఎంతో అదృష్టం గా భావిస్తున్నామని అట్లూరి అశ్విన్ తెలిపారు. 

ఎన్. టి. ఆర్ నట ప్రస్థానం మన దేశం తో మొదలై, మేజర్ చంద్రకాంత్ వరకు కొనసాగిందని, ఈ మద్య కాలంలో తెలుగు సినీ రంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన 75 ఏళ్ల చరిత్రకు తారకరామం వేదికైందని ఆయన తెలిపారు. 

అన్న ఎన్. టి. ఆర్ సినిమా వజ్రోత్సవ వేడుకలను అమెరికాలో జరుపుకోడం ఎంతో ఆనందం కలిగిస్తుందని అశ్విన్ తెలిపారు.

Taaraka Raamam book launch in America:

Bhageeradha Book Taaraka Raamam launch in America

Tags:   TAARAKA RAAMAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ