Advertisementt

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలు

Mon 31st Mar 2025 04:25 PM
ugadi  శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలు
Sri Kalasudha Telugu Association Ugadi Awards శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలు
Advertisement
Ads by CJ

చెన్నైలో తెలుగువారి ఘన కీర్తిని చాటుతూ 1998 న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ స్థాపించి సినీ రంగానికే కాక ఇతర రంగాలలో విశిష్ట సేవలు అందించే వారికి సైతం అవార్డ్స్ ను బహుకరిస్తూ అందరి మన్ననలను అందుకుంటుంది శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్‌. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్‌ గత 27 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ ఏడాది ఉగాది పురస్కారాలను చెన్నై లో శ్రీకళా సుధా తెలుగు అసోసిషియన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాలు పంచుకున్నారు. 

*గడ్డం సరోజ కు మహిళరత్న పురస్కారాన్ని అందజేశారు. 

ఈ సందర్భంగా గడ్డం సరోజ మాట్లాడుతూ.. నా భర్త వివేక్ మరియు మా కుటుంబ సభ్యుల సహకారం నాకెంతో ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మహిళలు ఏదైనా సాధిస్తారు అనడానికి నేనే ఉదాహరణ. ఉగాది రోజున ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. 

రజాకార్ చారిత్రాత్మక చిత్రానికి గాను గూడూరి నారాయణ రెడ్డి ఉగాది పురస్కారం అందుకున్నారు. 

*మత్తు వదలరాచిత్రానికి గాను ఉగాది పురస్కారాన్ని అందుకున్న చెర్రీ మాట్లాడుటూ.. రవి, నవీన్ యెర్నేని రాలేక పోయారు, ఆ అవార్డు కూడా నేనే అందుకుంటున్నా అన్నారు. 

*ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కి ఉగాది పురస్కారం దక్కగా ఆయన పెద్ది షూటింగులో బిజీగా ఉండి కూడా ఈ ఫంక్షన్ రావడం సంతోషం వ్యక్తం చేసారు. 

*రజాకార్ చిత్రంలో ఐలమ్మ పాత్రకు ఇంద్రజ ఉగాది పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రజ మట్లాడుతూ.. అందరికి ఉగాది శుభాకాంక్షలు, రజాకార్ ఐలమ్మ క్యారెక్టర్ కు నాకు ఉగాది పురస్కారం ఇచ్చారు, అందుకు కృతజ్ఞతలు, పెళ్లి తర్వాత నా భర్త సహకారంతో కెరీర్ లో ముందుకు సాగుతున్నాను అని తెలిపారు. 

*నిర్మాత ఏయమ్ రత్నం మాట్లాడుతూ.. ముందుగా కమిటీ సభ్యులకు అభినందనలు, పవన్ హరి హర వీరమల్లు సినిమా అందరికీ నచ్చుతుంది ముందు మీకు చూపిస్తాను, ఈ అవార్డు నాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది అన్నారు. 

*నటి రోహిణీ మాట్లాడుతూ..  మీ అందరికీ ధన్యవాదాలు,  తెలుగు ప్రేక్షకులు అందరికీ నేను పరిచయమే. అమ్మ క్యారెక్టర్ నేను చేస్తున్నాను అంటే అది వాళ్ళ అభిమానం, మీ ఇంట్లో మనిషిగా మారిపోయాను, ఈ అవార్డు నాకు ఇన్స్పిరేషన్ అని అన్నారు. 

*చంద్ర బోస్ మాట్లాడుతూ.. నేను ప్రతిసారి ధనుర్మాసం లో ఇక్కడికి వస్తాను, ఇదే వేదిక మీద ఈ అవార్డు నాకు రావడం సంతోషంగా ఉంది, ఎందరో ఇక్కడ అవార్డులు అందుకున్న వారు మంచి పొజిషన్ వున్నారు, శ్రీనివాస్ లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా గొప్పగా వుంది అన్నారు. 

*SBI మేనేజింగ్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. 

నేను చాలా సినిమాలు చూస్తాను. తెలుగు వాళ్ళు ఇలా కలిసి అభినందించడం చాలా ఆనందంగా వుంది. మా అమ్మాయి పేరు అమృత వర్షిణి, అలాగే చంద్ర బోస్ అమ్మాయి పేరు కూడా అమృత వర్షిణి అన్నారు. 

*జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. 

ఏందరో మహానుభావులు నుంచి అవార్డులు అందుకున్నాను, ఈ పురస్కారం నాకంతో విలువైంది అన్నారు.

*సంపూర్ణేష్ బాబు మట్లాడుతూ..  

ఎక్కడో చిన్న పల్లెటూరు లో బంగారు ఆభరణాలు చేసుకునే నాకు ఇంత గౌరవం దక్కటం చాలా సంతోషంగా ఉంది అన్నారు. 

*శ్యామలా దేవి మాట్లాడుతూ.. 

కృష్ణంరాజు గారు తో కలసి ఈ వేదికపై పాల్గొన్నాము, అది నాకు చాలా ఆనందంగా ఉంది, కృష్ణంరాజు లేరు అంటే నేను ఒప్పుకోను, ఆయన మన మధ్యలోనే ఉంటారు, చంద్ర బోస్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయనకి కూడా చాలా ఇష్టం. అలాగే ఇంద్రజ, రోహిణి కి కూడా అభినందనలు, కృష్ణంరాజు మహిళకు గౌరవం ఇచ్చేవారు. ఆయన ఆశయాలు ఎప్పుడూ కొనసాగిస్తాను. ప్రభు గారు మా ఇంటిలో మనిషి. కమిటీ సభ్యులు అందరికీ ధన్యవాదాలు అన్నారు. 

*ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ.. కళాసుధ అవార్డు నాకు రావడం నాలుగోసారి, ఇది రాయల సభ, బోస్ గారు నేను చిన్న స్కిట్ చేసాము. అది ఇప్పుడు చేస్తాం అంటూ చేసి చూపించారు. 

ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన అభిమానులను జెమిని సురేష్ తన యాంకరింగ్ తో అలరించారు.

Sri Kalasudha Telugu Association Ugadi Awards :

Sri Kalasudha Telugu Association Ugadi Awards 2025

Tags:   UGADI