ఒకప్పుడు టాలీవుడ్ లో ఉప్పెన చిత్రం తో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి కి కుర్ర హీరోలు వరసబెట్టి ఆఫర్స్ ఇచ్చారు. కృతి శెట్టి కెరీర్ లో ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు తప్ప హిట్స్ లేవు. అయినా పట్టించుకోకుండా కృతి శెట్టి కి వరస ఆఫర్స్ ఇచ్చారు. అప్పట్లో కృతి శెట్టి యంగ్ హీరోలకు క్రేజీ హీరోయిన్ గా మారింది.
ఆతర్వాత ఆ రేంజ్ లో శ్రీలీల కనిపించింది. ధమాకా సినిమా తర్వాత శ్రీలీల జోరు టాలీవుడ్ లో మాములుగా లేదు. ఆమెకున్న ప్లాప్స్ తో సంబంధమే లేకుండా యంగ్ హీరోలు అవకాశాలిచ్చారు. స్టార్ హీరోలు తప్ప శ్రీలీల ను యంగ్ హీరోలు వదల్లేదు. ఓ రెండేళ్లపాటు శ్రీలీల హవానే అందించింది.
ఇప్పుడు అదే మాదిరి భాగ్యశ్రీ బోర్సే క్రేజ్ మొదలైంది. డిజాస్టర్ సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే కి యంగ్ హీరోలు వరస అవకాశాలిచ్చారు. శ్రీలీల అవకాశాలు కూడా భాగ్యశ్రీ చెంతకు చేరాయి. మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్ తర్వాత కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా కూడా ఆమెకు షాకిచ్చిన అందం, నటన పరంగా ఆమె ఆకట్టుకుంది.
సినిమాల రిజల్ట్ తో పని లేకుండా భాగ్యశ్రీ బోర్ సే ని అందరూ పొగిడారు. అందుకే ఇప్పుడు ఆమెకు అదిరిపోయే అవకాశం వచ్చినట్టుగా తెలుస్తుంది. అది కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. స్వప్న సినిమాస్లో భాగ్యశ్రీ ఒక సినిమా చేయబోతోంది అని తెలుస్తుంది. ఇది నిజంగా భాగ్యశ్రీ బోర్సే అదృష్టమని చెప్పాలి. హిట్స్, ప్లాప్స్ తో సంబంధమే లేకుండా భాగ్యశ్రీ కి అవకాశాలు తలుపు తడుతున్నాయి.




సుమ క్రేజ్ కూడా కాపాడలేదు
Loading..