Advertisementt

సౌత్ హీరోలపై కత్రినా ప్రేమ!

Sat 27th Dec 2014 01:59 AM
katrina,star heroes,south heroes,romantic scenes,deodorants,shooting,sets,hundaga,neat,makeup,vrutti dharmam  సౌత్ హీరోలపై కత్రినా ప్రేమ!
సౌత్ హీరోలపై కత్రినా ప్రేమ!
Advertisement
Ads by CJ

వెండితెరపై హీరోహీరోయిన్ల రొమాంటిక్ సీన్లు చూస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఆ సీన్లు బాగా పండితే సినిమా హిట్టే. అయితే తెరపై కనిపించేది అంత నిజం కాదు. కేవలం నటన మాత్రమే. వృత్తిధర్మం కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా దర్శకుడు చెప్పినట్లు చేయాల్సిందే. ఇలాంటి సన్నివేశాలు చేసేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది అనిపించినా చేయక తప్పదు. బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ కత్రినాకైఫ్ ఇలాంటి సన్నివేశాలు చేసేటప్పుడు తనకు ఎదురైనా చెడు అనుభవాలను ఇటీవల వెల్లడించింది. కత్రినా ఇప్పటివరకు ఎక్కువగా స్టార్ హీరోల సరసన నటించింది. వారిలో కొందరు హీరోలు స్నానం వంటివి ఏమి చేయకుండా నేరుగా సెట్స్ పైకి వచ్చి మేకప్ వేసుకొని షూటింగుల్లో పాల్గొనేవారు. రాత్రి పార్టీల్లో పాల్గొని , ఉదయాన్నే లేచి స్నానం కూడా చేయకుండా రావడం వల్ల వారి నుండి విపరీతమైన కంపు వాసన వచ్చేదట. కనీసం డియోడ్రాంట్ కూడా వాడేవారు కాదట. అలాంటి వారితో రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు వాంతి వచ్చినట్లు ఉండేదని, షూటింగ్ కాబట్టి నరకం అనిపించినా భరించేదాన్ని అని చెప్పుకొచ్చింది. అయితే సౌత్ హీరోలను మాత్రం కత్రినా ప్రశంసలతో ముంచెత్తింది. సెట్స్ లో వారు ఎంతో హుందాగా, నీట్ గా ఉండేవారు అని ప్రసంసిస్తోంది. అయితే వాంతి వచ్చే అవతారంతో సెట్స్ పైకి వచ్చే వారు ఎవరు? అంటే మాత్రం పేర్లు చెప్పడానికి నిరాకరించింది కత్రినా..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ