Advertisementt

ముందు 'గోపాల గోపాల'... తర్వాత 'ఐ' !

Sat 27th Dec 2014 02:30 AM
gopala gopala,i,sankranthi,suresh productions,shankar,pawan kalyan,venkatesh,vikram,amy jakson,shootind,release,trailers  ముందు 'గోపాల గోపాల'... తర్వాత 'ఐ' !
ముందు 'గోపాల గోపాల'... తర్వాత 'ఐ' !
Advertisement
Ads by CJ

సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహించిన సినిమా 'గోపాల గోపాల'. భారీ అంచనాలతో తెరకెక్కించిన  ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఈ నెల 28 న జరగనుంది. ఈ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది విక్టరీ వెంకటేష్ , పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. అయితే శంకర్ దర్శకత్వంలో విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించిన చిత్రం 'ఐ' షూటింగ్ ముగించుకొని జనవరి 14 న రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు దర్శకుడు శంకర్. 'ఐ' మూవీ ట్రైలర్స్ మరియు టీజర్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయితే ప్రేక్షకులకు కనువిందే. కాని  'గోపాల గోపాల' టీమ్ సినిమాని ముందుగానే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అంతా ఫలించినట్లయితే ఈ సినిమా 5 రోజులు ముందుగానే అంటే జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ