Advertisementt

'మాలిని అండ్ కో' తో మురిపించనున్న పూనమ్!

Sat 27th Dec 2014 03:21 AM
poonam paande,malini and co,tollywood,abhinayam,bollywood,maneesha films,kishore raati,telugu,first look,sanchalanam  'మాలిని అండ్ కో' తో మురిపించనున్న పూనమ్!
'మాలిని అండ్ కో' తో మురిపించనున్న పూనమ్!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ సంచలనం పూనమ్ పాండే త్వరలో తెలుగు ప్రేక్షకులను కూడా తన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేయడానికి రెడీ అవుతోంది. ఆమె ప్రస్తుతం 'మాలిని అండ్ కో' అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. వీరు.కె. దర్శకుడు. మనీషా ఫిలింస్ పతాకంపై కిషోర్ రాఠీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం ద్వారా పూనమ్ పాండే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. తాజా గా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలను పూనంపందే తన సోషల్ నెట్ వర్కింగ్ పేజి ద్వారా విడుదల చేసింది. ఆ మధ్య ఈ సినిమాపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో పూనమ్ పాండే మాట్లాడుతూ.. 'మాలిని అండ్ కో' చిత్రంలో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాను. నటిగా నాకు మంచి గుర్తింపు తెచ్చే చిత్రం అవుతుంది. ఈ తరహా పాత్రలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను.. అంది. మరి పూనమ్ టాలీవుడ్ మరిన్ని సంచలనాలను సృష్టిస్తోందో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ