Advertisementt

'ఐ' గెస్ట్ లు ఓకే అయ్యారట..!

Sat 27th Dec 2014 03:48 AM
i,tamil,telugu,vikram,amy jakson,shankar,aaskar ravichandran,gacchibouli stadium,jackie chaan,mahesh babu,rajani kaanth,chiranjeevi  'ఐ' గెస్ట్ లు ఓకే అయ్యారట..!
'ఐ' గెస్ట్ లు ఓకే అయ్యారట..!
Advertisement
Ads by CJ

తమిళ, తెలుగు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఐ'. శంకర్ దర్శకత్వంలో విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జనవరి 9 విడుదల చేయాలని భావిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని ఆస్కార్ రవి చంద్రన్ నిర్మించగా, తెలుగులో ఆస్కార్ ఫిలింస్ తో పాటు మెగాసూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. కాగా తమిళంలో ఆల్ రెడీ విడుదలై సంచలనం సృష్టిస్తోన్న ఈ చిత్రమ పాటలు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి వస్త్న్నాయి. ఈ చిత్రం ఆడియోను ఈ నెల 30న హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం లో 5 వేల మంది సభికుల మధ్య నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ఈ వేడుకకు చైనీస్ సూపర్ స్టార్ జాకీచాన్ తో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబులు హాజరవుతరంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా సౌత్ఇండియన్ సూపర్ స్టార్  రజనీకాంత్, మెగా స్టార్ చిరంజీవి హాజరవుతున్నారని సమాచారం. మరి ఈ వేడుక మరెన్ని సంచలనాలకు వేదిక కానుందో చూడాలి..!   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ