Advertisementt

బాలయ్య సైతం అదే రూటులో..!

Wed 31st Dec 2014 05:58 AM
nandamoori natasimham,balakrishna,sathya deva,ramanarao,trisha,radhika aapte,titles,godse,simha,variyor,lion,register,rana,kalyaan ram,mahesh babu,katthi,  బాలయ్య సైతం అదే రూటులో..!
బాలయ్య సైతం అదే రూటులో..!
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా సత్యదేవా అనే నూతన దర్శకునితో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త రమణారావు నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. త్రిష, రాధిక ఆప్టే, ఈ చిత్రంలో బాలయ్య సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి అనేక టైటిల్స్ పరిశీలనకు వచ్చాయి. మొదట్లో 'గాడ్సే' అనుకున్నారు. ఆ తర్వాత 'వారియర్' అనే టైటిల్ ను పెట్టాలని సెంటిమెంట్ గా యూనిట్ భావించడం తో ఈ టైటిల్ ను ఖరారు చేయాలనుకున్నారు. కానీ ఆల్ రెడీ ఓ నిర్మాత ఆ టైటిల్ ను రిజిస్టర్ చేసి ఉండడం తో బాలయ్య యూనిట్ సందిగ్ధంలో పడింది. అయితే చివరకు ఈ చిత్రానికి 'ఎన్.బి.కె.లయన్' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్లు సమాచారం. గతం లో ఇలా టైటిల్స్ సమస్య వచ్చిన సమయంలో చాలా మంది హీరోలు ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. బాలయ్య నటించిన 'రాణా' చిత్రానికి ఇలాంటి సమస్యే రావడంతో 'యువరత్న రాణా' అని, మహేష్ బాబు చిత్రానికి 'మహేష్ ఖలేజా' అని, కళ్యాణ్ రామ్ 'కత్తి'.. ఇలా టైటిల్ కు ముందు తమ బిరుదునో లేక పేరునో జోడించి రిజిస్టర్ చేయడం తరచుగా వస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తానికి మరోసారి బాలయ్య అదే రూటులో వెళ్తున్నాడని విశ్వసనీయ సమాచారం.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ