సామాన్య మానవుడికి కూడా సైన్స్ అర్ధం అయ్యే విధంగా చెప్పగలిగే దిట్ట తన సినిమాలతో ప్రేక్షకులకు ప్రపంచాన్ని పరిచయం చేసే వ్యక్తి శంకర్. అలాంటి శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఐ'. ఆస్కార్ ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వి.రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రం గీతావిష్కరణ ఈ నెల 30 న హైదరాబాద్ పార్క్ హోటల్ లో పలువురు సినీ ప్రముఖులు దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి శీను మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ ప్రసంగిస్తూ హీరో విక్రమ్ ను త్రివిక్రముడితో(మూడు ముఖములు గలవాడు) పోల్చారు. ఒకే సినిమాలో విభిన్నమైన రోల్స్ చేయడం విక్రమ్ కి కొత్తేం కాదు. కాని 'ఐ' చిత్రం కోసం 2 సంవత్సరాల వ్యవధిలో సుమారు రెండు సార్లు తన మొత్తం శరీర ఆకృతిని మార్చుకున్నారు. అందమైన నల కూబరుడిగా, వికారమైన అష్టావక్రుడిగా, నర మృగ మానవుడిగా మూడు విభిన్నమైన పాత్రలు పోషించి త్రివిక్రముడితో పోల్చబడ్డాడు.