సీనియర్ హీరోల సరసన నటించడానికి టాప్ హీరోయిన్స్ అంగీకరించడంలేదు. వారి పక్కన చేస్తే తమను కూడా యంగ్ హీరోలు పట్టించుకోరనే భయంతో వారు ఉన్నారు. దీంతో ఫేడవుట్ అయిన భామలకు మన సీనియర్స్ నుండి పిలుపువస్తోంది. దీంతో ఆయా నటీమణులు తమకు ఇదే అదృష్టం అంటూ డిసైడ్ అవుతున్నారు. తాజాగా హీరోయిన్ గా ఫేడవుట్ అయి, ఐటెంగర్ల్ గా మారిన హంసా నందిని నాగార్జున హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్న 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రంలో అవకాశం సంపాదిన్చుకున్నాడని సమాచారం. కళ్యాన్ కృష్ణ అనే నూతన దర్శకుడు డైరెక్షన్ చేస్తోన్న ఈ చిత్రంలో ఆల్ రెడీ రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక బాలకృష్ణ హీరోగా సత్యదేవ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న 'ఎన్.బి.కె. లయన్' చిత్రంలో ఇప్పటికే పలుమార్లు తన పేరును మార్చుకున్నప్పటికీ పెద్దగా అవకాశాలు లేని అర్చన అలియాస్ వేద ఓ ముఖ్య పాత్రను పోషించనుందని సమాచారం. మొత్తానికి మన సీనియర్ హీరోలు ప్రస్తుతం ఓదార్పు యాత్ర చేస్తూ అవకాశాలు లేని హీరోయిన్ల మీద దృష్టిని కేంద్రీకరించారని చెప్పవచ్చు.