Advertisementt

పండగ చేసుకొంటున్న పవన్ అభిమానులు..!

Sat 03rd Jan 2015 03:18 AM
generation,social media,cine celebrities,updates,active,pawan kalyan,twitter,heero,party,fans,followers  పండగ చేసుకొంటున్న పవన్ అభిమానులు..!
పండగ చేసుకొంటున్న పవన్ అభిమానులు..!
Advertisement
Ads by CJ

నేటి జనరేషన్ లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. అందరు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాను వేదిక చేసుకొని తమ సినిమాల అప్ డేట్స్, ఇతర వ్యక్తిగత విశేషాలు, రాజకీయాలు.. ఇలా అన్నింటిపై స్పందిస్తూ తమ అభిమానులకే కాదు.. అందరికీ తమ భావాలను తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేని పవన్ కళ్యాణ్ సైతం నూతన సంవత్సరంలో ట్విట్టర్ లో ఖాతా తెరిచి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలపడంతో ఆయన అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తనపై వచ్చే విమర్శలకు ఇక నుండి తను సమాదానం ఇవ్వడానికి, అభిమానుల సందేహాలను నివృత్తి చేయడానికి పవన్ పూనుకోవడం వారికి ఆనందం కలుగజేస్తోంది. పవన్ నేడు కేవలం ఒక హీరోనే కాదు.. ఓ పార్టీకి అధినేత కూడా. పవన్ ఎన్నికల ప్రచారంలో తప్పు చేస్తే ఎవరినైనా సరే ప్రశ్నిస్తానని మాట ఇచ్చాడు. అయితే ప్రతిసారి ఆయన మీడియా ముందుకు రాలేని పరిస్థితి. దీంతో ఆయన ఇక తన ప్రశ్నలకు, అభిప్రాయాలను, సమాధానాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని నిర్ణయించుకోవడంతో ఆయన ఫాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన ఫాలోయర్ల సంఖ్య త్వరలో ఎవ్వరికీ లేని స్థాయిలో పెరుగుతుందనడంలో సందేహం లేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ