నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన టాలీవుడ్ కు చెందిన టాప్ హీరోలు, యంగ్ హీరోలు, సాధారణ హీరోలు కూడా ఫస్ట్ లుక్స్, టీజర్స్ తో హోరెత్తించారు. ముఖ్యంగా నందమూరి హీరోలైన బాలకృష్ణ ఎన్టీఆర్ ల కొత్త చిత్రాల టీజర్స్ యూట్యుబ్ లో హల్ చల్ చేసాయి. బాలయ్య నటిస్తున్న 'ఎన్.బి.కె. లయన్', జూనియర్ ఎన్టీఆర్ 'టెంపర్' చిత్రాల టీజర్స్ మాస్ కు విపరీతంగా నచ్చేశాయి. ఈ రెండు ట్రైలర్స్ లోనూ బాలయ్య, ఎన్టీఆర్ లు ఒకే ఒక్క డైలాగ్ తో దండయాత్ర ప్రారంభించారు. ఇక పవన్ వెంకీలు కలిసి నటిస్తున్న స్టిల్స్, మోక్షన్ పిక్చర్స్ కు తోడుగా ఓ పాటను రిలీజ్ చేయడంతో మేగాభిమానులు కూడా ఎంతో ఆనందపడుతున్నారు. యువహీరోలైన నిఖిల్ 'సూర్య వర్సెస్ సూర్య', గోపీచంద్ 'జిల్', అల్లరినరేష్ 'బందిపోటు', అనుష్క 'రుద్రమదేవి' వంటి చిత్రాల ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి. మొత్తానికి ఒకరిద్దరు పెద్ద హీరోల అభిమానులు తప్ప మిగిలిన చాలా మంది హీరోల అభిమానులు ఈ ఏడాదిని ఎంతో సంతోషంగా ప్రారంభించారనే చెప్పాలి.