పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా తెరవడం ఏమో గానీ రికార్డుల మోత మోగుతోంది. అకౌంట్ ఓపెన్ చేసిన ఫస్ట్ డే అత్యధిక ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని, ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్ లో పవన్ చేరాడు. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లను బీట్ చేసి పవన్ సెకండ్ ప్లేస్ సాధించాడు. ఆయన అకౌంట్ ఓపెన్ చేసిన 22 నిమిషాల్లో ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 4000లకు చేరుకుంది. 12 గంటలు పూర్తవ్వగానే ఆ సంఖ్య కాస్తా 55 వేలు దాటింది. అకౌంట్ ఓపెన్ చేసిన 18 గంటలకు 70 వేలకు పైగా ఫాలోవర్స్ అయ్యారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు 24 గంటల్లో 46 వేల మంది పైచిలుకు ఫాలోవర్స్ అయ్యారు. అమితాబ్ కు 37500 పై చిలుకు ఫాలోవర్స్ అయ్యారు . అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరు సెలబ్రిటీలు 2,3 స్థానాల్లో ఉన్నారు. తొలి స్థానంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడు. ఆయన ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన ఒక రోజులో 2,15,100 ఫాలోవర్స్ అయ్యారు. తాజాగా పవన్ 2 వ స్థానం దక్కించుకున్నాడు.