Advertisementt

కన్ఫ్యూజ్ చేస్తోన్న సుబ్రహ్మణ్యం..!

Sun 04th Jan 2015 12:04 AM
film makers,hit,trend,follow,ravi teja,poori jagannaadh,itlu sravani subrahmanyam,title,confuse,sai dharma tej,hareesh shankar,dil raju,subrahmanyam for sale,aswani datth,swapna,silent,shekar kammula   కన్ఫ్యూజ్ చేస్తోన్న సుబ్రహ్మణ్యం..!
కన్ఫ్యూజ్ చేస్తోన్న సుబ్రహ్మణ్యం..!
Advertisement
Ads by CJ

మన ఫిల్మ్ మేకర్స్ ఏదైనా సినిమా హిట్టయితే అదే దారిలో నడుస్తూ.. ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు. ట్రెండ్ ను ఫాలో అవడమే కానీ, వీళ్ళకు ట్రెండ్ ను క్రియేట్ చేయడం రాదు. ఇంతకీ విషయం ఏమిటంటే.. అప్పుడెప్పుడో రవి తేజ హీరోగా పూరీజగన్నాధ్ దర్శకత్వంలో 'ఇట్లు శ్రావణి.. సుబ్రహ్మణ్యం' సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. తాజాగా మరో రెండు చిత్రాలు సుబ్రహ్మణ్యం పేరుతో రూపుదిద్దుకొంటూ టైటిల్ విషయంలో సినీ ప్రేమికులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. సాయి ధర్మ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె తమ స్వప్న సినిమా పతాకంపై నాని హీరోగా ఓ చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల శిష్యుడు దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి 'ఎవడే సుబ్రహ్మణ్యం' అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. మొత్తానికి సుబ్రహ్మణ్యం అనే పేరు తమకు లక్ ను తీసుకొస్తుందని భావించడమే దీనికి కారణం..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ