ఇటీవలే 'ముకుంద'తో తెరంగేట్రం చేసిన మెగాహీరో వరున్తెజ్ ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ఇష్టాయిస్టాలను వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ... ఒక్కో సినిమా విషయంలో ఒక్కో దర్శకుడు నచ్చుతాడు. వీళ్ళే సూపర్ అని చెప్పలేను. ఒకరిద్దరు పేర్లు చెప్పమంటే క్రిస్టిఫర్ నోలన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ పేర్లు చెబుతాను. ఇక నా ఫేవరెట్ హీరోయిన్ ప్రియాంకాచోప్రా. తను స్కిన్ షోకే పరిమితం కాకుండా నటనలో కూడా చాలా వేరియేషన్స్ చూపుతుంది. సినిమాల అప్ డేట్స్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలకు వెళుతుంటాను. ఒకప్పుడు షార్ట్స్, నిక్కర్లు వేసుకొని తిరిగేవాడిని. ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్స్ గమనిస్తున్నాను. కొత్త మోడల్ షూస్ వేసుకోవడం అంటే ఇష్టం. మెగా ఫ్యామిలీలో అందగాడివి అంటారంతా..! నాకైతే బాబాయ్ అందగాడని అనిపిస్తుంది. మా ఒక్కొకరిలో ఒక్కో అందం ఉంది. సేవా కార్యక్రమాలల్లో కూడా ఆసక్తి ఉంది. పదవతరగతిలో ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ స్కూల్ ను దత్తత తీసుకున్నాం. ఏడాదిన్నర నడిపాం. తర్వాత డబ్బులు లేక ఆపేశాం. ఇక నాకు ఇష్టమైన ఆట వాలీబాల్. ఇప్పటికీ రోజు ఓ గంటైనా ఆడుతాను.. అంటూ చెప్పుకొచ్చాడు.