Advertisementt

ఆశలపల్లకిలో స్టార్ హీరోలు...!

Tue 06th Jan 2015 04:54 AM
2014,top stars,mahesh babu,junior ntr,pawan kalyan,prabhas,gopala gopala,gabbar singh2,temper,bahubali,koratala siva,allu arjun,trivikram,boyapati sreenu,ram charan,sreenuvaitla,nbk lion  ఆశలపల్లకిలో స్టార్ హీరోలు...!
ఆశలపల్లకిలో స్టార్ హీరోలు...!
Advertisement
Ads by CJ

2014వ సంవత్సరం టాప్ స్టార్స్ అయిన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారికి కలిసిరాలేదు. ఇక పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోలైతే గత ఏడాది అసలు వెండితెరపై కనిపించనేలేదు. కానీ 2015 పై మాత్రం దాదాపు స్టార్ హీరోలందరూ భారీ ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ ఏడాది దాదాపు స్టార్ హీరోల చిత్రాలు అన్నీ విడుదలకానున్నాయి. కొంతమందైతే ఈ ఏడాది రెండు సినిమాలతో రావడానికి రెడీ అవుతున్నారు. ఇలా 2015 స్టార్ హీరోలకు ఆశలు రేపుతోంది. మొదటగా ఈ సంక్రాంతి పవన్ కళ్యాణ్, వెంకటేష్ లు కలిసి నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రం విడుదల కానుంది. ఆ వెంటనే మరో సినిమా చేసి ఇదే ఏడాది సినిమాను విడుదల చేయాలని వెంకీ నిర్ణయించుకున్నాడట. అయితే ఆయన చేయబోయే చిత్రం ఏమిటి? అనేది ఇంకా తెలియరావడంలేదు. పవన్ కళ్యాణ్ 'గోపాల గోపాల' తర్వాత 'గబ్బర్ సింగ్2' ను ప్రారంభించి ఇదే ఏడాది చివరకు ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ 'టెంపర్'తో పాటు సుకుమార్ చిత్రాన్ని కూడా ఇదే ఏడాది విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'బాహుబలి' చిత్రం రెండు పార్ట్ లు ఇదే ఏడాది విడుదలకానున్నాయి. మహేష్ బాబు కొరటాల శివ చిత్రాన్ని మేలో విడుదల చేసి, ఆ వెంటనే మరో చిత్రాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. అల్లుఅర్జున్ కూడా త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే బోయపాటి శ్రీను చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. రామ్ చరణ్ విషయానికి వస్తే కొత్త ఏడాదిలో ఆయన నటించిన శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసే సినిమా ఒక్కటే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక బాలయ్యది కూడా 'ఎన్ బి కె లయన్' ఒక్కటే విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి మన స్టార్స్ అందరూ ఈ ఏడాదిపై భారీ ఆశలే పెట్టుకొని ఉన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ