Advertisementt

వాలెంటైన్స్ డే సెంటిమెంట్..!

Tue 06th Jan 2015 11:38 AM
valentines day,youth,colour full,release,lagadapati sreedhar,sentiment,follow,krishnamma kalipindi iddharinee,sudheer babu,nanditha,charminar,mahesh babu guest role  వాలెంటైన్స్ డే సెంటిమెంట్..!
వాలెంటైన్స్ డే సెంటిమెంట్..!
Advertisement
Ads by CJ

ప్రేమికుల దినోత్సవం అంటే యూత్ కు చాలా ఇష్టం. ఆ రోజంతా యూత్ కలర్ ఫుల్ గా, ఉత్సాహంగా ఉంటారు. అందుకే కొందరు నిర్మాతలు, మరీ ముఖ్యంగా యూత్ చిత్రాల వారు తమ సినిమాలకు వాలెంటైన్స్ డే ను సినిమాల రిలీజ్ కు ముహూర్తంగా ఎంచుకుంటూ ఉంటారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ తొలి నుంచి వాలెంటైన్స్ డే సెంటిమెంట్ ఫాలో అవుతూ వస్తున్నాడు. ఆయన తన చిత్రాలను అదే రోజున విడుదల చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన నిర్మించిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రాన్ని సైతం అదే రోజున విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడంలో ఘనవిజయం సాధించిన 'చార్మినార్'కు ఇది రీమేక్. రామలక్ష్మీ సినీ క్రేయేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు కూడా ఓ గెస్ట్ పాత్రను పోషించాడని సమాచారం. మరి ఈ ప్రేమకథా చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ రకంగా ఆకట్టుకుంటుందో వేచిచూదల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ