Advertisementt

త్వరలోనే పెళ్లి భోజనం పెట్టనున్న అల్లరోడు..!

Wed 07th Jan 2015 03:39 AM
tollywood bachelor,ntr,allu arjun,ram charan,gopichand,comedy star allari naresh,pelli,kosthaandhra,bandipotu  త్వరలోనే పెళ్లి భోజనం పెట్టనున్న అల్లరోడు..!
త్వరలోనే పెళ్లి భోజనం పెట్టనున్న అల్లరోడు..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోలంతా ఒక్కొక్కరుగా వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. గత రెండు మూడేళ్ళుగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, గోపి చాంద్ వంటి వారితో పాటు ఆది వంటి వారు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. కాగా గత కొంతకాలంగా టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ కూడా పెళ్లి చేసుకోబోతునట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అన్ని కుదిరితే అల్లరోడి పెళ్లి ఈ ఏడాది ప్రధమార్ధంలోనే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అతని కోసం కుటుంబ సభ్యులు సంబంధాలు చూసే పనిలో తలమునకలై ఉన్నారు. నరేష్ అభిరుచికి తగిన అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారు. తనకు మోడ్రన్ అంటూ పార్టీలు, పబ్బులు అంటూ తిరిగే అమ్మాయి అవసరం లేదని, కుటుంబ వ్యవాహారాలు భాద్యతగా చక్కబెట్టే సంప్రదాయబద్దమైన అమ్మాయి కావాలని అల్లరి నరేష్ అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతో కోస్తాంధ్రలో నరేష్ అభిరుచికి తగిన అమ్మాయి కోసం వెతుకుతున్నారు. అమ్మాయిని చూసే బాధ్యతలను నటుడు చలపతి రావు, నరేష్ సమీప బంధువు అమ్మిరాజు తమ భుజాలకెత్తుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా మినిమమ్ గ్యారంటీ హీరోగా ఓ ఉపు ఊపుఊపిన నరేష్ ప్రస్తుతం మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన 'బందిపోటు' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ