Advertisementt

ఎంపీ అసదుద్దీన్‌ అతి చేస్తున్నాడా..??

Wed 07th Jan 2015 06:16 AM
hyderabad mp assaduddin owaisi,assaduddin owaisi about hindus,assaduddin owaisi vs bjp,assaduddin owaisi vs vhp,assaduddin owaisi in controversy,owaisi brothers  ఎంపీ అసదుద్దీన్‌ అతి చేస్తున్నాడా..??
ఎంపీ అసదుద్దీన్‌ అతి చేస్తున్నాడా..??
Advertisement
Ads by CJ

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రతి శిశువూ ముస్లిమేనంటూ అసద్‌ చేసిన వ్యాఖ్యలపై అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విషయమై వెనక్కి తగ్గడానికి అసద్‌ అంగీకరించడం లేదు. పైగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్టేట్‌మెంట్లు ఇస్తూ మరింత రాద్దాంతాన్ని సృష్టిస్తున్నారు. అయితే భారతదేశంలో ప్రస్తుతం నివసిస్తున్న వారి మూలాలు హిందువులవేనని గతంలో పలువురు బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు స్టేటమెంట్లు ఇచ్చారు. దీనికి బదులుగానే కావాలనే అసద్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు ఈ స్టేట్‌మెంట్లు చిలికి చిలికి గాలివానలా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ సొంత లాభాల కోసం నాయకులు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారంటూ నేషనల్‌ మీడియాలో వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ