Advertisementt

ఇమేజ్ సంపాదించడానికి ప్రయత్నాలు..!

Tue 13th Jan 2015 07:50 AM
thamila super star,dhanush,amithabh bacchan,akshara hasan,shamithabh,craze,response,different getups,bollywood  ఇమేజ్ సంపాదించడానికి ప్రయత్నాలు..!
ఇమేజ్ సంపాదించడానికి ప్రయత్నాలు..!
Advertisement
Ads by CJ

తమిళ స్టార్ ధనుష్ ఇప్పటికే తన తొలిచిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఆయన  అమితాబ్ బచ్చన్ క్రేజ్ ను ఉపయోగించుకొని, బాలీవుడ్ లో మరింత ఇమేజ్ సంపాదించుకునే పనిలో పడ్డాడు. అనుకున్నట్లుగానే రజనీ అల్లుడి పాచిక బాగానే పారినట్లు కనిపిస్తోంది. అమితాబ్ బచ్చన్, ధనుష్ లతో  పాటు కమలహాసన్ చిన్న కుమార్తె  అక్షరహాసన్ లు ప్రధానపాత్రలు పోషిస్తున్న 'షమితాబ్' చిత్రానికి బాలీవుడ్ లో మంచి క్రేజ్ వస్తోంది. ఇటీవల విడుదల చేసిన చిత్రం ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను రాబడుతోంది. బాల్కి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో అమితాబ్, ధనుష్ లు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 6 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 వేల థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. చిత్రానికి 

 

ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండగా , పి.సి.శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా చిత్రంలో అమితాబ్ స్వయంగా పాడిన పాట అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇక చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. అక్షర హాసన్ తాను నటించిన పాటలకు తానే కొరియోగ్రాఫర్ గా వ్యవహరించగా, అమితాబ్ తాగుబోతుగా విస్కీ గురించి ఉపన్యాసం ఇస్తున్నాడు. మొత్తానికి అమితాబ్ బచ్చన్ సాయంతో ధనుష్ బాలీవుడ్ లో సెటిలవ్వాలని కోరుకుంటున్నాడు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ