Advertisementt

మెగాఫోన్ పట్టనున్న బుల్లితెర మెగాస్టార్..!

Tue 13th Jan 2015 07:52 AM
ramoji rao,etv,prabhakar,zee tv chance,muddu bidda,mega phone,geetha arts,allu aravind,story,pre production house,official,low budjet  మెగాఫోన్ పట్టనున్న బుల్లితెర మెగాస్టార్..!
మెగాఫోన్ పట్టనున్న బుల్లితెర మెగాస్టార్..!
Advertisement
Ads by CJ

రామోజీరావు తనయుడు ఈటీవీ సుమన్ బతికివున్నప్పుడు ఈటీవీ లో అన్నీ తానై వ్యవహరించి, తర్వాత చాలా వివాదాలను ఫేస్ చేసిన నటుడు ప్రభాకర్. ఈటీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, నిర్వాహకుడిగా వ్యవహరించిన ఆయన   తర్వాత ఈటీవీ నుండి బయటకు వచ్చాడు. సినిమాల్లో కూడా మంచి చాన్స్ లు సంపాదించి, తర్వాత జీటీవీ వంటి చానెల్స్ ను లైన్ లో పెట్టుకున్నాడు. 'ముద్దుబిడ్డ' సీరియల్ ద్వారా దర్శకునిగా మారిన ఆయన ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి అయ్యాడు. దానికి కారణం ఆయన త్వరలో మెగాఫోన్ చేతబట్టనుండటం కారణం కాగా.. సినిమాను ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లుఅరవింద్ నిర్మించనుండటం మరో కారణం. ఇప్పటికే ఆయన అల్లుఅరవింద్ కు స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న సినిమాకు సంబందించిన వివరాలు అతి త్వరలో అఫీషియల్ గా వెల్లడికానున్నాయి. కాగా చిత్రం లోబడ్జెట్ చిత్రంగా తెరకెక్కనుందని తెలుస్తుంది

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ