ఒడిషా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ.. ప్రజాభిమానాన్ని చురగున్నారు. 2000 సంవత్సరం నుంచి ఒడిషా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ వరుసగా నాలుగోసారి ఆ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికయ్యారు. సీఎం పీఠం ఎక్కిన 14 ఏళ్ల తర్వాత కూడా 2014లో ఒడిషాలో బీజేడీ పార్టీ 21 ఎంపీ స్థానాలకు 20 గెలుచుకుంది. అలాగే 147 స్థానాలకు 117 ఎమ్మెల్యే స్థానాల్లో విజయబావుట ఎగురవేసింది. మరి అంతగా నవీన్ పట్నాయక్ ప్రజల మనసులను ఎందుకు గెలుచుకున్నారన్న దానికి ఇటీవల జరిగిన ఓ సంఘటనను కూడా ఉదాహరణగా చూపవచ్చు. తన తండ్రికి చెందిన పది కోట్ల ఆస్తిని నవీన్ ఒడిషా ప్రభుత్వానికి రాసిచ్చారు. సాధారణంగా సీఎం పీఠం ఎక్కగానే వందల కోట్లు ఎలా సంపాదించాలని చూసే ప్రస్తుత రోజుల్లో తన తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వానికి రాసిచ్చి 15 ఏళ్లుగా తాను ఒడిషా సీఎంగా ఎలా కొనసాగుతున్నది నవీన్ పట్నాయక్ చెప్పకనే చెప్పాడు.