శంకర్ దర్సకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'ఐ' ఈ నెల 14వ తేదీన తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం ప్రమోషన్ విషయంలో బాలీవుడ్ కు ఇచ్చిన ప్రాధాన్యత ను తమిళ, తెలుగు భాషలపై డైరెక్టర్ శంకర్ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తన ప్రమోషన్ అంతా హిందీ వెర్షన్ పై కేంద్రీ కృతం చేసి కోలీవుడ్, టాలీవుడ్ లను చిన్నచూపు చూస్తున్నాడంటూ కొందరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటికే హిందీలో రెండు పాటల ట్రైలర్స్ ను విడుదల చేసిన శంకర్ తెలుగు, తమిళంలో మాత్రం ఇప్పటివరకు ఒక్కసాంగ్ టీజర్ ను కూడా విడుదల చేయలేదనే వాదన వినిపిస్తోంది. అంతేకాదు...ప్రమోషన్ విషయంలో కూడా ఆయన బాలీవుడ్ పైనే తన దృష్టి కేంద్రీకరించాడని, తెలుగు, తమిళ భాషలను అసలు పట్టించుకోవడం లేదని వారు వాదిస్తున్నారు. మొదటి నుండి శంకర్ కు దన్నుగా నిలిచిన తమిళ, తెలుగు పరిశ్రమలను ఆయన చిన్నచూపు చూడటం సరికాదనే వాదన బాగా వినిపిస్తోంది. మరి దీనిపై శంకర్ ఏ విధంగా స్పందిస్తాడో వేచిచుడాల్సివుంది..!