అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా పర్యటన కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత గణతంత్య్ర వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటన ఇండియాలో జనవరి 25న ప్రారంభం కానుంది. అప్పటినుంచి మూడు రోజులపాటు అంటే జనవరి 27 వరకు ఒబామా ఇక్కడ పర్యటించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఒబామా ఎక్కడెక్కడ పర్యటించనున్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నప్పటికీ ఆయన ఈసారి తాజ్‌మహల్‌ను సందర్శిస్తారన్న సమాచారం మాత్రం బయటకు వెలువెడింది. క్రితంసారి ఒబామా ఇండియాలో పర్యటించినప్పుడు తాజ్‌మహల్‌ను సందర్శించకుండానే వెనుదిరిగారు. అయితే ఈసారి మాత్రం తన భార్య మిచెల్లి ఒబామాతో కలిసి జనవరి 27న తాజ్‌మహల్‌ను సందర్శించేలా ఒబామా పర్యటన ఖరారు చేసుకున్నారు. ఇక తెలంగాణ, ఏపీలకు ఒబామాను రప్పించడానికి ఇద్దరు సీఎంలు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడటం లేదు.