Advertisementt

పవన్ ని సంతృప్తిపరిచే అవార్డు ఏది..!

Sat 17th Jan 2015 01:13 AM
pawan kalyan,film nagar,bjp,nda,padma,award,padmasree,padmabhushan,seniors,reward  పవన్ ని సంతృప్తిపరిచే అవార్డు ఏది..!
పవన్ ని సంతృప్తిపరిచే అవార్డు ఏది..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ గురించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. కేంద్రంలోని బిజెపి, ఎన్డీయే ప్రభుత్వం భారతీయులు ప్రతిష్టాత్మకంగా భావించే 'పద్మ' అవార్డులలో ఒకదానిని పవన్ కు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ఈ ఏడాదిలో వీలు కాకపోతే వచ్చే ఏడాదైనా సరే ఈ అవార్డును పవన్ కు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోందని అంటున్నారు.. మరి పవన్ కు ఈ అవార్డు వస్తుందా? రాదా? వస్తే పద్మశ్రీ వస్తుందా? లేక ఏకంగా పద్మభూషణ్ ఇస్తారా? పవన్ దానికి అర్హుడా? కాదా? వంటి అనేక సందేహాలు అందరిలో మెదులుతున్నాయి. అయితే పవన్ కంటే సీనియర్లు.. ఈ అవార్డుకు వన్నె తెచ్చేవారు తెలుగు సినీ పరిశ్రమలో అనేక మంది ఉన్నారని.. వారిని కాదని పవన్ కు ఇస్తే వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉందని మాత్రం అందరూ అంటున్నారు. ఏదిఏమైనా పవన్ మనస్తత్వానికి ప్రభుత్వాలు ఇచ్చే అవార్డుల కంటే ప్రేక్షకులు ఆయనకు ఇస్తున్న రివార్డులే కోటిరెట్లు ఎక్కువ అని పవన్ అభిమానులు వాదిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ