Advertisementt

నితిన్ ను ఆటాడిస్తాడా...!

Sat 17th Jan 2015 04:44 AM
nitin image,chinnadana nekosam,flop talk,safe zone,stamina,aatadistha,ravikumar chowdary,pilla nuvvuleni jeevitham,romantic entertainer,hit  నితిన్ ను ఆటాడిస్తాడా...!
నితిన్ ను ఆటాడిస్తాడా...!
Advertisement
Ads by CJ

నితిన్ ఇమేజ్ సినిమా సినిమాకు బాగా పెరుగుతోందనే దానికి ఆయన తాజా చిత్రం 'చిన్నదాన నీకోసం' ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ చివరకు ఈ మూవీ సేఫ్ జోన్ లోకి ప్రవేశించడం నితిన్ స్టామినాను తెలియజేస్తోంది. ఇక గతంలో నితిన్ వరుస ఫ్లాప్ ల్లో ఉన్నప్పుడు జస్ట్ ఓకే అనిపించుకున్న చిత్రం 'ఆటాడిస్తా'. ఈ చిత్రానికి ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు. చాలా కాలంగా ఫ్లాప్ ల్లో ఉన్న రవికుమార్ చౌదరి తాజా చిత్రం 'పిల్లా నువ్వులేని జీవితం' మంచి హిట్ గా నిలవడంతో ఆయన దర్శకత్వంలో తన తాజా చిత్రం చేయడానికి నితిన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే దర్శకుడు రవికుమార్ చౌదరి నితిన్ కు స్టొరీ చెప్పి ఓకే చేయించుకున్నాడని, ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. మరి నితిన్ కు చౌదరి ఎలాంటి హిట్ అందిస్తాడు? అనేది వేచిచుడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ