యంగ్ హీరో నిఖిల్ బ్యాడ్ టైం ముగిసి ఇక అంతా మంచికాలం ఉన్నదిలే అనిపిస్తోంది. వరుస ఫ్లాప్ ల తర్వాత 'స్వామి రారా, కార్తికేయ' విజయాలతో ఊపుమీదున్న నిఖిల్ తాజా చిత్రం 'సూర్య వర్సెస్ సూర్య' కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఎంతో కష్టపడి మంచి ఇమేజ్ సంపాదిస్తేగానీ యంగ్ హీరోలకు యాడ్స్ పరంగా బ్రాండ్ అంబాసిడర్ అవకాశాలు రావు. అలాంటిది నిఖిల్ కు తాజాగా ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. యూక్లిడ్ క్లాత్ కంపెనీ ప్రచారకర్తగా నిఖిల్ తో అగ్రిమెంట్ చేసుకున్నారని సమాచారం. మరి రాబోయే రోజుల్లో నిఖిల్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో వేచిచూడాల్సివుంది..!