Advertisementt

కిరణ్‌బేడి అదృష్టం పండింది..!!

Mon 19th Jan 2015 12:33 AM
kiran bedi joining bjp,kiran bedi vs kejrival,bjp delhi cmcandidate kiran bedi,delhi elections,kiran bedi 6p formula,kiran bedi with amithshah  కిరణ్‌బేడి అదృష్టం పండింది..!!
కిరణ్‌బేడి అదృష్టం పండింది..!!
Advertisement
Ads by CJ

బీజేపీలో చేరిన మూడో రోజుల్లోనే కిరణ్‌బేడికి అదృష్టం తలుపుతట్టింది. ఆమె ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దాదాపు ఖరారైంది. ఈ విషయాన్ని బీజేపీ స్పష్టంగా ప్రకటించనప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం సీఎం అభ్యర్థి కిరణ్‌బేడినేనంటూ విస్పష్టంగా ప్రకటించింది. ఇది ఎంతైనా బీజేపీకి కలిసొచ్చే విషయమై. తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిగా, నిజాయితీపరురాలిగా ప్రజల్లో కిరణ్‌బేడికి మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఢిల్లీలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను కిరణ్‌బేడి సమర్థవంతంగా రూపుమాపగలుగుతారని ప్రజలు నమ్ముతున్నారు. దీనికితోడు చదువుకున్న యువతలో 'ఆప్‌' పార్టీపై ఉన్న సానుభూతిని కిరణ్‌బేడి దెబ్బతీయగలుగుతారు. అదే పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆమె 'ఆప్‌'లోని లొసుగులను ఎండగట్టడంతోపాటు కేజ్రీవాల్‌కు ధీటుగా సమాధానం ఇవ్వగలుగుతారని బీజేపీ అధిష్టానం నమ్ముతున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే వచ్చిన మూడు రోజులకే ఆమెను సీఎం అభ్యర్థిగా ఖరారు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ