మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ శశిథరూర్ ఇప్పుడు ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించడంలో బిజీగా ఉన్నాడు. ఎన్నికలకు ముందు మోడీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన శశిథరూర్ వ్యవహార శైలిలో సడెన్‌గా మార్పు రావడంపై రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. గతేడాది మృతిచెందిన శశిథరూర్ భార్య సునంద పుష్కర్‌ది సాధారణ మృతి కాదని, ఆమెపై విషప్రయోగం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మృతి గురించి శశిథరూర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో శశిథరూర్ ప్రధాని మోడీని పొగడటం భవిష్యత్తుపై ఆయన భయాన్ని తెలుపుతోందని రాజకీయ నాయకులు చెబుతున్నారు. తన భార్య హత్య కేసుకు సంబంధించి తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే శశిథరూర్ ఇప్పుడు మోడీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు శశిథరూర్ ప్రధాని మోడీని పొగడటం కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.