Advertisementt

అమెరికా అధ్యక్షుడి పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు

Mon 19th Jan 2015 05:30 AM
barak obama india tour,barak obama in india republic day celebrations,protection for barak obama tour,barak obama with narendra modi  అమెరికా అధ్యక్షుడి పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు
అమెరికా అధ్యక్షుడి పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు
Advertisement
Ads by CJ

అమెరికా అధ్యక్షుడి భారత పర్యటనకు కనీవిని ఎరగనిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా నుంచే 1600 మంది సిబ్బంది బారక్‌ ఒబామా రక్షణ కోసం ఇండియాకు వస్తున్నారు. వీరిలో సీఐఏ, ఎఫ్‌బీఐ సిబ్బంది కూడా ఉన్నారు. 2010లో బారక్‌ ఒబామా పర్యటన సందర్భంగా 800 మంది రక్షణ సిబ్బంది మాత్రమే అమెరికా నుంచి ఇండియాక వచ్చారు. కాని ఈసారి ఆ సంఖ్య రెట్టింపైంది. అంతేకాకుండా గతంలో ఒబామా పర్యటనకు 4 విమానాలనే ఉపయోగించగా ఈసారి ఆ సంఖ్య 8కి చేరింది. ఇక దీనికితోడు ఢిల్లీ గగనతలాన్ని నోఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని అమెరికా చేసిన విజ్ఞప్తిని భారతప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రస్తుతం 'ఈసిస్‌' బలపడటం, దక్షిణ ఆసియాలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండటంతోనే ఒబామా పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక భారత్‌నుంచి 20 వేల మంది భద్రత బలగాలు అమెరికా అధ్యక్షుడి పర్యటనకు భద్రత కల్పించనున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ