Advertisementt

మరలా కమెడియన్ గా మారనున్న హీరో..!

Mon 19th Jan 2015 05:52 AM
comedian,hero,range,career,sunil,trivikram,allu arjun,mahesh babu,pawan kalyan  మరలా కమెడియన్ గా మారనున్న హీరో..!
మరలా కమెడియన్ గా మారనున్న హీరో..!
Advertisement
Ads by CJ

కమెడియన్ గా పీక్ స్టేజీ లో ఉన్నప్పుడు సునీల్ హీరోగా టర్న్ తీసుకున్నాడు. హీరోగా రెండు మూడు హిట్స్ వచ్చినప్పటికీ హీరోగా ఆయన కెరీర్ మాత్రం నత్త నడకన సాగుతోంది. కెరీర్ పరంగానే కాదు.. ఆర్దికంగా కూడా ఆయన హాస్య నటునిగా ఉన్నప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు అని ఆమధ్య ఆయనే స్వయంగా వెల్లడించారు. కాగా ప్రస్తుతం సునీల్ రెండు మూడు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు మూడు చిత్రాలు తాను అనుకున్న స్థాయిలో ఆడకపోతే ఆయన తన నిర్ణయంపై పునరాలోచించే పనిలో ఉన్నాడట. హీరోగా మారిన తర్వాత మరలా కమెడియన్ గా తప్పు కాదని, అది అతని రేంజ్ ను ఏ మాత్రం తగ్గించే విధంగా ఉండదని సునీల్ మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన త్రివిక్రమ్ సర్ది చెప్పడంతో తన కెరీర్ ను మరలా కమెడియన్ గా బిజీ చేసే పనిలో సునీల్ ఉన్నాడని సమాచారం. అందునా ఆయన మరలా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చే చిత్రం త్రివిక్రమ్ సినిమాలోనే అని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లుఅర్జున్ సినిమాలో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఆయనకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి వారి చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక చిత్రం ద్వారా సునీల్ మరలా కమెడియన్ గా నవ్వులు పూయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ