రాజకీయాల్లోకి ఎంటర్ అయి, బిజీ అయిన తర్వాత తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఇక సినిమాల్లో నటించడేమో అని అందరూ బాధపడ్డారు. అయితే పవన్ మాత్రం తాను సినిమాలు చేస్తూనే ఉంటానని ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు. కాగా ఆయన నటించిన 'గోపాల గోపాల' చిత్రం ఇటీవలే విడుదలైంది. దీని తర్వాత ఆయన బాబి దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్2'తో బిజీ కానున్నాడు. అ తర్వాత చిత్రానికి 'గోపాల గోపాల' దర్శకుడు కిషోర్ పార్దసాని దర్శకత్వం వహించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు. సో... పవన్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టుకునే పనిలో ఉన్నాడు కాబట్టి ఆయన అభిమానులు ఇక బాధపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.