నటునిగా, హీరోగా టాలీవుడ్ లోకి ప్రవేశించి ఏళ్ళు గడుస్తున్నా... యిప్పటికీ హీరో రాజశేఖర్ కు తెలుగు స్పష్టంగా మాట్లాడటం చేతకాదు. ఆయన ఒరిజినల్ వాయిస్ లో తెలుగు వింటే పిచ్చెక్కుతుంది. అయినా కూడా సాయి కుమార్, అయన సోదరుల అండతో బండిలాగిస్తున్న రాజశేఖర్ పై ఇప్పటికీ అనేక మంది సెటైర్లు వేస్తుంటారు. ఆమధ్య వచ్చిన పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' లో కూడా పవన్ రాజశేఖర్ ని ఇమిటేట్ చేసి నవ్వులు పూయించాడు. మరి ఏమనుకున్నాడో ఏమో గానీ త్వరలో రాజశేఖర్ తన సొంత గొంతుతో తెలుగులో ఓన్ డబ్బింగ్ చెప్పనున్నాడనే మాట వింటే భయం కలుగుతోంది. తమిళంలో హిట్టయిన 'సూదుకవ్వమ్' కు రీమేక్ గా, జీవిత నిర్మాణంలో సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఫిబ్రవరిలో విడుదలకు సిద్దమవుతోన్న ఈ చిత్ర్రంలో రాజశేఖర్ దొంగగా నటిస్తున్నాడు. ఆ పాత్రకు చాలా తక్కువగా డైలాగ్స్ ఉంటాయట. దాంతో ఆ డైలాగ్స్ తానే సొంతంగా చెప్పాలని రాజశేఖర్ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.