Advertisementt

స్టొరీ వేటలో నందమూరి హీరోలు..!

Mon 19th Jan 2015 06:15 AM
tollywood,family movies,pandavulu pandavulu thummeda,manam,harikrishna,kalyan ram,ntr,balakrishna,story  స్టొరీ వేటలో నందమూరి హీరోలు..!
స్టొరీ వేటలో నందమూరి హీరోలు..!
Advertisement
Ads by CJ

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో సినీ ప్రముఖుల ఫ్యామిలీ చిత్రాలు మొదలయ్యాయి. మంచు ఫ్యామిలీ హీరోలు కలిసి నటించిన 'పాండవులు పాండవులు తుమ్మెద', అక్కినేని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మనం' వంటి చిత్రాలు ప్రజాదరణ పొందడంతో మరి కొన్ని ఫ్యామిలీల హీరోలు కుడా కలిసి నటించడానికి ఆసక్తి చూపుతూ దానికి మంచి మంచి కధలను వెతికే పనిలో ఉన్నారు. కాగా త్వరలో నందమూరి  హీరోలు కూడా కలిసి నటించే అవకాశం ఉంది.  ఈ విషయాన్ని ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ ఓ టీవీ చానెల్ లో చెప్పాడు. తన తండ్రి నందమూరి హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణ, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ లతో  పాటు తాను కూడా కలిసి నటించే ఉద్దేశ్యంలో ఉన్నామని, మంచి స్టోరీ దొరికితే తాము కలిసి నటించేందుకు సిద్దమని ప్రకటించాడు.  మరి ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ.. మొత్తానికి నందమూరి హీరోలు తమకు నచ్చిన స్టోరీ వేటలో ఉన్నారని మాత్రం స్పష్టమవుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ