Advertisementt

కోలీవుడ్ పై కన్నేసిన బ్యూటీ..!

Mon 19th Jan 2015 10:53 PM
milky beauty,agadu,tollywood,kollywood,bahubali,thamanna,bengal tiger,ravi teja,weight,  కోలీవుడ్ పై కన్నేసిన బ్యూటీ..!
కోలీవుడ్ పై కన్నేసిన బ్యూటీ..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నప్పుడు ఇక్కడ కాదని బాలీవుడ్ కు వెళ్ళిన మిల్కీ బ్యూటీ తమన్నా అక్కడ ఏదీ కలిసిరాకపోవడంతో తిరుగుటపాలో మరలా ఇక్కడకు వచ్చింది. వచ్చిందే తడవుగా మహేష్ సరసన 'ఆగడు' చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆ చిత్రం విజయం సాధిస్తే టాలీవుడ్ లో తనకు తిరుగులేదని భావించింది. కానీ ఆ చిత్రం అనూహ్యంగా డిజాస్టర్ అయింది. దీంతో ఇక ఆమె కోలీవుడ్ లో అయితేనే తనకు మంచి జరుగుతుందని భావించింది. కాగా ఆమె ప్రస్తుతం తెలుగులో 'బాహుబలి' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందుతోంది. అదే సమయంలో రవి తేజ సరసన 'బెంగాల్ టైగర్' లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినా ఈ అమ్మడికి టాలీవుడ్ పై నమ్మకం కలగడం లేదు. ఇంత కాలం టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల కోసం మెరుపు తీగలా ఉన్న తమన్నా... తాజాగా కొంచెం బొద్దుగా మారింది. ఆ మాత్రం బొద్దుగా లేకపోతే తమిళ తంబీలు ఆదరించరనే ఆలోచనతోనే ఆమె వెయిట్ పెరిగిందంటున్నారు. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ కు వచ్చిన ఆమె బొద్దుగా మారడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 'బాహుబలి' కోసం 6కిలోలు వెయిట్ తగ్గిన ఈ భామ ఇప్పుడు దానికి రెండింతలు బరువు పెరిగిందట. ప్రస్తుతం కోలీవుడ్ లో ఆర్య సరసన ఓ చిత్రంలో నటిస్తోన్న ఆమె త్వరలో కోలీవుడ్ ను శాసించాలనే తాపత్రయంలో ఉందట...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ