ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ ఇటీవల వరుస పరాజయాలతో డీలా పడిఉన్నాడు. కాగా ఆయన కోసం ఆయన పెదనాన్న స్రవంతి రవికిషోర్ తమిళంలో ధనుష్ హీరోగా 5 కోట్ల పెట్టుబడితో రూపొంది 50 కోట్లు కలెక్ట్ చేసిన 'వేల ఇల్లై పట్టదారి' (వి.ఐ.పి) చిత్రం రైట్స్ ను తీసుకున్నాడు. కానీ ఎందుకనో ఆ చిత్రానికి రామ్ నో చెప్పాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని 'రఘు వరన్ బి.టెక్' అనే పేరుతో డబ్బింగ్ చేశాడు. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తోంది. దీంతో ఆ సినిమాను తానెందుకు చేయలేదా? అనే బాధలో ఉన్నాడట రామ్. అయితే ధనుష్ ను తప్ప ఆ స్టోరీని తనతో చేస్తే ప్రేక్షకులు ఆదరించరనే ఉద్దేశ్యంలో రామ్ ఉన్నాడు. మరి ఆయన తీసుకున్న నిర్ణయం రైటా? రాంగా? అనే విషయంపై ఫిలింనగర్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా ఈ సంక్రాంతికి రామ్ హీరో గా రూపొందుతున్న 'పండగ చేస్కో' చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇవి అందరినీ బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయినా ఈ చిత్రంపై రామ్ మీద ఉన్న నమ్మకం కంటే డైరెక్టర్ గోపీచంద్ మలినేని మీద ఉన్న నమ్మకమే బిజినెస్ కు, ఆడియన్స్ లో ఇంట్రస్ట్ కు కారణంగా చెబుతున్నారు. మరి ఈ చిత్రంతో నైనా రామ్ పండగ చేసుకుంటాడో లేదో వేచి చూడాల్సి ఉంది...!