Advertisementt

తెలంగాణ ఫిల్మ్‌ జర్నలిస్టుల ఐడి కార్డుల పంపిణీ

Tue 20th Jan 2015 07:47 AM
telangana film journalists association id cards distribution  తెలంగాణ ఫిల్మ్‌ జర్నలిస్టుల ఐడి కార్డుల పంపిణీ
తెలంగాణ ఫిల్మ్‌ జర్నలిస్టుల ఐడి కార్డుల పంపిణీ
Advertisement
Ads by CJ

తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌కి అనుసంధానంగా ఇటీవల ఏర్పడిన తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యుల లైడి కార్డుల పంపిణీ సోమవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి సభ్యులకు ఐడి కార్డులను ఆవిష్కరించి సభ్యులకు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు నారాయణరాజు, అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జాయింట్‌ సెక్రటరీ చిన్నమూల రమేష్‌, ట్రెజరర్‌ సి.ఎం.ప్రవీణ్‌, సాయిరమేష్‌, పొన్నం శ్రీనివాసరావు, జె.పి. తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు నారాయణరాజు మాట్లాడుతూ ‘‘మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాబూమోహన్‌గారికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ అసోసియేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంకా ఆర్థికంగా బలపడాల్సిన అవసరం వుంది. ఫిలిం జర్నలిస్టుల ముందు ఎన్నో సమస్యలు వున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఉద్యోగ భద్రత, హెల్త్‌ కార్డులు, హౌసింగ్‌ మొదలైనవి. కెసిఆర్‌గారికి ఎంతో సన్నిహితులైన బాబూమోహన్‌గారు ఈ సమస్యల్ని వారి దృష్టి తీసుకెళ్తారని, మా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.

అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ‘‘మా అసోసియేషన్‌లో ప్రస్తుతం 70 మంది వున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగాల్సి వుంది. మీడియాలోని పొలిటికల్‌, జనరల్‌, క్రైమ్‌లతో పాటు ఇతర విభాగాల్లో వున్న జర్నలిస్టులకు అక్రిడేషన్‌ కార్డులు ప్రభుత్వం ఇస్తోంది. కానీ, ఫిలిం జర్నలిస్టులను మాత్రం పక్కన పెట్టారు. వారితో సమానంగా మాకు కూడా అక్రిడేషన్‌, హెల్త్‌ కార్డులు, హౌసింగ్‌ తదితర అంశాలు సి.ఎం. దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు వారితో మా సమస్యలు విన్నవించుకునేందుకు అవకాశం కల్పించాలని బాబూమోహన్‌గారికి కోరుతున్నాను’’ అన్నారు. 

ఎమ్మెల్యే బాబూమోహన్‌ మాట్లాడుతూ  ‘‘ఫిలిం జర్నలిస్టులు నాకు సోదరులతో సమానం. నేను ముఖ్యఅతిథిగా ఇక్కడికి రాలేదు. ఒక ఫ్యామిలీ మెంబర్‌గా వచ్చాను. ప్రత్యేకంగా తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఏర్పరుచుకున్నప్పటికీ అందరూ కలిసి మెలిసి వుండాల్సిన అవసరం వుంది. పాత స్నేహాలు స్నేహాలుగానే వుండాలి. గౌరవాధ్యక్షులు, అధ్యక్షులు చెప్పిన సమస్యలు నిజానికి పెద్ద సమస్యలేం కావు. చాలా చిన్న సమస్యలు. మిగతా జర్నలిస్టులకు ఏయే సదుపాయాలు వున్నాయో అవన్నీ ఫిలిం జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలన్నది మీ ప్రధానమైన అభ్యర్థన. ఈ విషయాన్ని తప్పనిసరిగా నేను కెసిఆర్‌గారి దృష్టికి తీసుకెళ్తాను. అవసరమైతే మిమ్మల్ని అందర్నీ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిరచే ఏర్పాటు చేస్తాను. ఈ విషయమే కాదు ఏ విషయమైనా నాతో నిర్మొహమాటంగా చెప్పండి. నా సహకారం అందించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా వుంటాను’’ అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ