Advertisementt

దీనిపై కూడా రెండు రాష్ట్రాల మధ్య గొడవ..!!

Tue 20th Jan 2015 08:19 AM
arogyasree trust,kcr vs chandrababu naidu,ap vs telangana,arogyasree trust ceo,arogyasree in telangana handover  దీనిపై కూడా రెండు రాష్ట్రాల మధ్య గొడవ..!!
దీనిపై కూడా రెండు రాష్ట్రాల మధ్య గొడవ..!!
Advertisement
Ads by CJ

అవకాశం దొరకడమే ఆలస్యం కొట్టుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వెనుకడుగు వేయడం లేదు. సర్దుకుపోదామన్న సంగతిని పక్కనపెట్టి ప్రతి విషయంలోనూ రెండు ప్రభుత్వాలు తగువులాడుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు విషయాల్లో గొడవపడ్డ ఈ రెండు ప్రభుత్వాల మధ్య తాజాగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సంబంధించి కూడా విభేదాలు వచ్చాయి. ఈ ట్రస్టుపై తమదే ఆధిపత్యం అంటూ రెండు ప్రభుత్వాలు అధికారులను నియమిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ ట్రస్టుకు ఐఏఎస్‌ అధికారి లవ్‌ అగర్వాల్‌ను సీఈఓగా నియమించగా.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జ్యోతి బుద్ద ప్రసాద్‌ను సీఈఓగా నియమించింది. దీంతో ఈ ట్రస్టుపై ఎవరిది ఆధిపత్యమనే విషయమై సందిగ్ధం నెలకొంది. అయితే ఓ అడుగు వెనక్కు వేసిన ఏపీ ప్రభుత్వం తాము అధికారిని నియమించడం వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులు రావని, తెలంగాణ ప్రభుత్వం ఏయే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యం అందిస్తుందో తాము కూడా అవే ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తామని ప్రకటించింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ