Advertisementt

అదే నయనతార స్పెషాలిటీ..!

Wed 21st Jan 2015 01:24 AM
nayanathara,chemistry,call sheets,second innings,simbu,career,response,udayanidi,stalin  అదే నయనతార స్పెషాలిటీ..!
అదే నయనతార స్పెషాలిటీ..!
Advertisement
Ads by CJ

నటిగా మారిన పుష్కరకాలం తర్వాత కూడా అప్రతిహతంగా సాగిపోతున్న హీరోయిన్ నయనతార. వయసు పెరుగుతున్నా కూడా చెక్కుచెదరని అందం ఆమెది. యంగ్ హీరో అయిన స్టార్ హీరో అయిన తన పాత్రలో ఒదిగిపోతుంది. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయి... వెండితెరపై అద్బుతమైన కెమిస్ట్రీ పండిస్తుంది. అందుకే తమిళ హీరోలు, దర్శకులు ఆమె వెంటపడుతూ కాల్షీట్లు కోసం ఆమె ఇంటి ముందు క్యూ కడతారు. నిజజీవితంలో శింబు, ప్రభుదేవా వంటి వారితో ప్రేమాయణం  బెడిసికొట్టి మానసికంగా బాగా దెబ్బతిన్నప్పటికీ దాని ఎఫెక్ట్ తన కెరీర్ పై పడకుండా కాపాడుకుంటూ ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి వరుస చిత్రాలతో మునుపటి కన్నా బిజీగా మారుతోంది. చాలాకాలం తర్వాత ఆమె తన మాజీ ప్రియుడు శింబుతో కలిసి నటించిన 'ఇదు నమ్మ ఆలు' చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. దీనికి అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక యువహీరో ఉదయనిది స్టాలిన్ సరసన ఆమె నటిస్తోన్న 'నాన్ జెండా' చిత్రంలో కూడా వీరిద్దరి మధ్య అద్బుతమైన కెమిస్ట్రీ పండిందని కోలీవుడ్ టాక్. మొత్తానికి చాలా విషయాల్లో నయనతార ఎందరికో స్పూర్తిగా మారి.. తను ఏమిటో నిరుపిస్తునే ఉంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ