జగనన్న వదిలిన బాణం షర్మిల మరోపాదయాత్రకు సిద్ధమైంది. బుధవారం నుంచి ఆమె నల్గొండ జిల్లాలో ఏడు రోజులపాటు 'పరామర్శ యాత్ర' చేపట్టనున్నారు. వైఎస్‌ఆర్ మృతితో గుండె ఆగి చనిపోయిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆరు నియోజకవర్గాల్లోని 30 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. అటు తర్వాత కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇదే జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు. ఇక గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన యాత్రకు స్పందన కరువవడంతో ఈసారి వైసీపీ నాయకులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్రను విజయవంతం చేయడాన్ని వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక అదే సమయంలో వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్న పార్టీ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం నింపి వలసలను నిరోధిండచానికి కూడా షర్మిల ఈ యాత్రలో కృషి చేయనున్నట్లు సమాచారం.