Advertisementt

టాప్ డైరెక్టర్స్ ని పట్టించుకోని స్టార్ హీరోలు..!

Thu 22nd Jan 2015 03:10 AM
top directors,star heroes,harish shankar,boyapati,vinayak  టాప్ డైరెక్టర్స్ ని పట్టించుకోని స్టార్ హీరోలు..!
టాప్ డైరెక్టర్స్ ని పట్టించుకోని స్టార్ హీరోలు..!
Advertisement
Ads by CJ

కారణాలు ఎందుకో తెలియవు కానీ కొందరు టాప్ డైరెక్టర్స్ ను మన స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు. 'గబ్బర్ సింగ్'తో పవన్ కళ్యాణ్ కు పూర్వ వైభవం తెచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం డిజాస్టర్ కావడంతో ఆయనతో సినిమా చేయాలని భావించిన పలువురు స్టార్స్ వెనక్కి తగ్గారు. దీంతో ఆయన చివరకు అప్ కమింగ్ మెగాహీరో సాయి ధరమ్ తేజ్  తో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం చేస్తున్నాడు. ఇక 'నాయక్' తర్వాత స్టార్ హీరోలతో చేయని  వినాయక్ ఇప్పుడు కొత్తవారిని పరిచయం చేసే పనిలో బిజీ అయిపోయాడు. నిన్న బెల్లకొండ సాయి శ్రీనివాస్ తో, ఇప్పుడు అఖిల్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇక బోయపాటి శ్రీను వెనక 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ ఉన్నప్పటికీ ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ తో సర్డుకుపోతున్నాడు. మొత్తానికి వీరితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఎందుకు ఆసక్తి చూపడం లేదనేది ఎవ్వరికి అంతు చిక్కని ప్రశ్నగా మారింది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ