మంచి మంచి వినూత్న కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తే పెద్ద పెద్ద విజయాలు లభిస్తాయని ఎప్పటి నుండో రుజువవుతూ ఉంది. అలాంటి జోనర్ చిత్రాలు సామాన్య ప్రేక్షకులనే కాదు...పరిశ్రమ వర్గాలను కూడా బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి నుండి మంచి స్పందనను రాబట్టుకున్న చిత్రాలు రెండు చిన్న చిత్రాలే కావడం విశేషం. నిఖిల్ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'సూర్య వర్సెస్ సూర్య' తో పాటు నాని హీరోగా రూపొందుతున్న 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రాల టీజర్స్, ట్రైలర్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాలపై ఇంట్రస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాలకు ఇండస్ట్రీలో మంచి టాక్ ఉండటమే కాదు... బిజినెస్ సైతం ఎంకరేజింగ్ గా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి రాజమౌళి నుండి కితాబులు అందుకున్న ఈ రెండు చిత్రాలు విడుదలై ఎలాంటి ఫలితాలను సాధిస్తాయో వేచిచూడాల్సివుంది...!