Advertisementt

మెగా ఫ్యామిలీ మాయలో పడిన టాప్ డైరెక్టర్..!

Thu 22nd Jan 2015 08:01 AM
mega family heros,trivikram sreenivas,ntr,prabhas,bunny julayi  మెగా ఫ్యామిలీ మాయలో పడిన టాప్ డైరెక్టర్..!
మెగా ఫ్యామిలీ మాయలో పడిన టాప్ డైరెక్టర్..!
Advertisement
Ads by CJ

మాటల మాంత్రికుడు, దర్శక తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా ఫ్యామిలీ మాయలో పడిపోయాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఆయన పిలుపుకోసం ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్  హీరోలు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నప్పటికి ఆయన వీలుంటే మెగా హీరోలు, లేకపోతే మహేష్ బాబు అనే ఫార్ములానే ఫాలో అవుతున్నాడు. బన్నీతో 'జులాయి' తీసిన తర్వాత పవన్ తో 'అత్తారింటికి దారేది' చిత్రం చేశాడు. ఇప్పుడు మరలా బన్నీతో 'హుషారు' (కన్ ఫర్మ్ కాలేదు) చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఆయన పవన్ తో మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడని, బన్నీ సినిమా పూర్తయిన వెంటనే ఆ చిత్రం స్క్రిప్ట్ పనిలో నిమగ్నమవుతాడని అంటున్నారు. ఆ తర్వాత మరోసారి మహేష్ తో సినిమా చేస్తానని మాట కూడా ఇచ్చాడు. మరి అందరి హీరోలతో సినిమాలు చేయడం త్రివిక్రమ్ కు ఆసక్తిలేదా? అనే ప్రశ్న మెదులుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ